విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు, దాతలు అందించే ఉచిత స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని మండల విద్యాధికారి జీ. కళారాణి విద్యార్థులకు తెలిపారు.
దిశ చివ్వేంల : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు, దాతలు అందించే ఉచిత స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని మండల విద్యాధికారి జీ. కళారాణి విద్యార్థులకు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో.. 8వ తరగతి విద్యార్థులకు యన్ యంయంయస్ ఉచిత స్టడీ మెటీరియల్ ను అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిపియుయస్ అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఉచిత స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని స్కాలర్షిప్ కు ఎంపిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి పి యు ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యామా రమేశ్ తో పాటు మాధవి, శ్రీనివాస్, కృష్ణ, నాగార్జున చారి, జాని రెడ్డి శంకర్, బాసు, భవాని సంఘమిత్ర, మణి, వెంకట రమణాచారి, విద్య శ్రీ మల్సూర్, నీలోఫర్, రమాదేవి తదితర ఉపాద్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.