సీఎం రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-10 14:09 GMT

దిశ, వలిగొండ:- సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసీ పునర్జీవం కార్యక్రమంలో భాగంగా మండలంలోని సంగెం గ్రామానికి వచ్చిన సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేసి.. బుల్లోజర్లతో తొక్కిస్తాం, కుక్క చావు చస్తావు అంటూ హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం వలిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు  భీమలింగానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగెం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కీసరి రాంరెడ్డి, కాసుల కృష్ణ, వరికుప్పల మల్లేష్, మొగుళ్ల శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి,పడమటి మమత, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, పలుసం రమేష్, నాయకులు మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల, డేగల పాండు, నిరంజన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అప్రోజ్, కళ్లెం మారయ్య, బలుకూరి నరేష్ రెడ్డి, శాంతికుమార్, పోలె పాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Similar News