ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇచ్చిన హామీల ప్రకారం ఆగస్టు 15 లోగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీని చేయబోతున్నామని మంత్రి నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-04 17:22 GMT

దిశ, హుజూర్ నగర్ ‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇచ్చిన హామీల ప్రకారం ఆగస్టు 15 లోగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీని చేయబోతున్నామని మంత్రి నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఇది చారిత్రాత్మక విషయమని ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ చెయ్యలేదని స్పష్టం చేశారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు.

గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచలేదని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 27 వేల కోట్లు కూడా దాటలేదని తాము 31 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు.


Similar News