ప్రకృతి వ్యవసాయమే సంపూర్ణ ఆరోగ్యం

సమాజంలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు మరికంటి భవాని పేర్కొన్నారు.

Update: 2024-11-09 12:23 GMT

దిశ,మర్రిగూడ : సమాజంలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు మరికంటి భవాని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వట్టిపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న భారతి గార్డెన్ లో శనివారం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ఆధ్వర్యంలో.. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాంటి స్వార్థం లేకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న బాగుండాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాడని తెలిపారు.నేల,విత్తనాలు ,మిత్ర పురుగులను కాపాడుకుంటే ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు లభిస్తాయని తెలిపారు. సీఎం రైతుల సంక్షేమం కోసం వ్యవసాయమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు నడిపిస్తూ.. రైతుల కు లాభదాయకమైన వ్యవసాయం చేయడానికి రైతు సదస్సులను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అభ్యుదయ రైతులు నరేందర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి ఇంద్రారెడ్డిల పలు పంటల ప్రకృతి సాగు పై రైతులకు అవగాహన కల్పించారు .రైతుల ఆర్థిక అభివృద్ధితోపాటు.. వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సేంద్రీయ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడం కోసం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం గా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ సభ్యులు ఏడు దొడ్ల వినీల్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సు ప్రాంగణంలో ప్రకృతి సేద్యంతో తయారుచేసిన కృత్రిమ ఎరువుల స్టాల్స్ ను పెట్టడంతో.. రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు .ఈ కార్యక్రమానికి విచ్చేసే రైతులకు 40 కేజీల యూరియా తో పాటు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, మండల వ్యవసాయ అధికారిని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News