పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

జాజిరెడ్డిగూడెం మండల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలకు కాసర్ల పహాడ్ గ్రామంలో అప్పగించిన స్థలాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ సోమవారం పరిశీలించారు.

Update: 2024-09-30 11:31 GMT

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): జాజిరెడ్డిగూడెం మండల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలకు కాసర్ల పహాడ్ గ్రామంలో అప్పగించిన స్థలాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ సోమవారం పరిశీలించారు. రూ.5 లక్షలతో స్థలాన్ని చదును చేసి, రీ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాసర్ల పహాడ్ ఎస్సీ కాలనీ మహిళలు కరెంట్ స్తంభాలు ఏర్పాటు, మురుగు కాలువలు నిర్మించాలని ఎమ్మెల్యేకు సమస్యలను విన్నవించగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామంలో రోడ్డు మీద నుండి పారుతున్న వరద కాలువ నీటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో పవన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రెడ్డి, మోరపాక సత్యం, కుంట్ల సురేందర్ రెడ్డి, గుడిపల్లి మధుకర్ రెడ్డి, దిర్శినపు యాదయ్య, నల్లగుంట శ్రీనివాస్, బొల్లం లింగరాజు, నర్సింగ వెంకటేశ్వర్లు, దాసరి సోమయ్య, కృష్ణమూర్తి, గిరిబాబు, మహారాజు, యాదగిరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News