సాగునీటి కాలువల పున:రుద్ధీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: ఎమ్మెల్యే కుంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి కాలువలకు, చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట వేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-30 12:40 GMT

దిశ, వలిగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి కాలువలకు, చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట వేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని సంగం- బొల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న భీమ లింగం కత్వను క్షేత్రస్థాయి పరిశీలను నీటిపారుదల శాఖ అధికారులతో పరిశీలించారు. భీమ లింగం కాలువ ప్రవేశించే పొద్దుటూరు, నాతాళ్ల గూడెం, వలిగొండ అక్క-చెల్లెళ్ల చెల్లెండ్ల చెరువు, మల్లెపల్లి, వెల్వర్తి, మొగిలి పాక, ముద్దాపురం, చిత్తాపురం, గ్రామాల్లో ఉన్న భీమ లింగం కాలువ కల్వర్టలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలంలోని కత్వాల, సాగునీటి కాలువలను మోడలైజ్ చేయడం కోసం 450 కోట్లు మంజూరు అయ్యాయని, హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన కోసం 1500 కోట్లు మంజూరు చేశారని, మూసీ పక్షాన కోసం రెండు టీఎంసీల గోదావరి జలాలను గండిపేట, ఉస్మాన్ సాగర్‌లో వదిలితే మూసీ నదిలో మంచినీరు ప్రవహిస్తుందని అన్నారు.

దీంతో మూసీ పరివాహక ప్రాంత రైతాంగం కాలుష్యం నుండి బయటపడే మార్గం సుగమమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహితను, చేవెళ్లగా మార్చి రైతాంగాన్ని మోసం చేశారే తప్ప, మూసీ ప్రక్షాళన కోసం ఒక్కరోజైనా ఆలోచన చేయలేదన్నారు. హైడ్రాతో కబ్జాకు గురి అయిన చెరువుల పునరుద్ధరణ జరుగుతుందని, చెరువులు, కుంటలు, కాలువలలో నీరు ఉన్నట్లయితే భూగర్భ జలాలు పెరిగి సాగునీరు, తాగునీరు కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి శ్రీనివాస్ రెడ్డి, డి శాంతకుమారి, నీటిపారుదల శాఖ ఏఈలు, నాయకులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, ఉల్లిపే మల్లేశం, బెలిదే నాగేశ్వర్, సామ రాంరెడ్డి, గూడూరు వెంకటరెడ్డి, కుంభం వెంకట్ పాపిరెడ్డి, బత్తిని సహదేవ్, బద్దం సంజీవరెడ్డి, కాసుల వెంకన్న, కొండూరు సాయి, బత్తిని నగేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News