కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. కలెక్టర్ ఎండార్స్‌ను కొట్టివేసిన డిపిఓ

జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసి కలెక్టర్ ఎండార్స్ ను జిల్లా పంచాయతీ అధికారి కొట్టివేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లో సోమవారం చోటు చేసుకుంది.

Update: 2024-09-30 12:23 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్: జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసి కలెక్టర్ ఎండార్స్ ను జిల్లా పంచాయతీ అధికారి కొట్టివేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లో సోమవారం చోటు చేసుకుంది. ప్రజావాణి దరఖాస్తుదారులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామానికి చెందిన సంపూర్ణ అనే మహిళ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి స్థలం విషయంలో ఇద్దరు కొడుకులు, తనకు సమస్య ఉందని పరిష్కరించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. తను ఉంటున్న ఇంటి సమస్యను పరిష్కరించి ఇంటి పన్ను, నల్ల బిల్లును సంపూర్ణ పేరు మీద మార్చాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండాకేకు దరఖాస్తు అందజేశారు.

అయితే గ్రామపంచాయతీ సమస్య కావడంతో జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు. సదరు అర్జీదారు అయినా సంపూర్ణ దరఖాస్తును జిల్లా పంచాయతీ అధికారి సునంద కు అందజేయగా జిల్లా కలెక్టర్ ఎండార్స్ చేసిన కలెక్టర్ చేతి రాతలు కొట్టి వేసి మాకు సంబంధం లేదు అని అర్జీదారులను తిరిగి పంపారు. అర్జీదారు రాలైన సంపూర్ణ ఆవేదన తెలపడంతో అక్కడ ఉన్న పోలీసులు వారిని బయటికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న సందర్శకులు ఒక జిల్లా మేజిస్ట్రేట్ చేతి రాతలను కొట్టివేయడం ఏమిటని ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా స్థాయి అధికారి ఇంత నిర్లక్ష్యంగా ఉండటం సరికాదనే విమర్శలు వెల్లువెత్తాయి.


Similar News