మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.

Update: 2024-09-30 11:40 GMT

దిశ, రామన్నపేట: ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు పోరాడతామని తెలిపారు. రామన్నపేట పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసే వరకు రైతులతో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ లోపు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు రుణమాఫీ చేయలేదో తెలపాలన్నారు. కేవలం గొప్పలు తప్ప హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. హైడ్రా పేరిట డ్రామాలాడుతూ పేద ప్రజల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు అందించకుండా రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు. అనంతరం రైతు సమస్యలపై తహసీల్దార్ లాల్ బహుదూర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, నాయకులు వేమవరపు సుధీర్ బాబు బందెల రాములు కన్నబోయిన బలరాం బద్దుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News