నూతనకల్ మండల పరిధిలో బీఆర్ఎస్ లో పలువురి చేరిక
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు.
దిశ, నూతనకల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన బత్తుల రాజు, వెంకన్న, సందీప్, మధు, ఇరుగు రాజు తో పాటు పలువురు ఆదివారం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే కిషోర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, కేసిఆర్ ప్రభుత్వం గొప్పగా పాలిస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వ ప్రగతిశీల ఆలోచన విధానానికి తామంత ఆకర్షితులమై బిఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంపెల్లి రామిరెడ్డి, జెడ్పిటిసి దామోదర్ రెడ్డి, కార్యదర్శి సురేష్, నాయకులు బుచ్చయ్య, విద్యాసాగర్ ,విజయ్ కుమార్, గాంధీ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.