రిపేర్లు ఎప్పుడవుతాయో..? నీళ్లు ఎప్పుడొస్తాయో..??
“మిషన్ భగీరథ” నీటి సరఫరాకు మళ్లీ ఆటంకాలు ఏర్పడ్డాయి.
దిశ,తుంగతుర్తి: “మిషన్ భగీరథ” నీటి సరఫరాకు మళ్లీ ఆటంకాలు ఏర్పడ్డాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం చిల్పకుంట్ల ప్రాంతం వద్దనున్న ప్రధానMain motors burnt in Paleru Reservoir. నీటి శుద్ధి కేంద్రానికి సరఫరా చేసే..మూడు ప్రధాన మోటర్లు కాలిపోయాయి. శుక్రవారం నుంచి ఈ సమస్య తలెత్తింది. ఫలితంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న 168 ప్రాంతాలకు నీటి సరఫరా శుక్రవారం నుంచి నిలిచిపోయింది. పాలేరు రిజర్వాయర్ లో ఒక్కొక్కటి 285 హెచ్ పి సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా చిల్పకుంట్ల శుద్ధి కేంద్రానికి నీటి సరఫరా జరుగుతుంది.ఈ మూడింటిలో రెండింటిని నడిపిస్తూ.. మరో దాన్ని అదను కోసం పక్కకు పెడతారు. అయితే ప్రస్తుతం ఈ మూడు మోటార్లు కాలిపోయాయి.గతంలో ఒకటి కాలిపోగా రెండో పంపుసెట్టు ఈ నెల 4న చెడిపోయింది.ఈ రెండింటిని మరమ్మత్తుల నిమిత్తం హైదరాబాద్ వర్క్ షాప్ కు అధికారులు పంపి పక్కకు పెట్టిన మరో మోటార్ ద్వారా శిల్పకుంట్ల శుద్ధి కేంద్రానికి నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ మోటర్ కూడా శుక్రవారం (అంటే ఈ నెల 8న) కాలిపోయింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. 168 గ్రామాలకు నిలిచిపోయిన మిషన్ భగీరథ శిల్పకుంట్ల నీటి శుద్ధి కేంద్రం ద్వారా నియోజకవర్గంలోని నూతనకల్,మద్దిరాల,తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం,నాగారం మండలాల్లో 168 ప్రాంతాలకు ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతుంది.అయితే చెడిపోయిన మూడు మోటార్లను రిపేర్ చేయాలంటే కొంత సమయం తీసుకోనుంది. అప్పటి వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఇదిలా ఉంటే మోటార్ల రిపేర్ కోసం అధికారులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.