నల్గొండలో ప్రేమ వ్యవహారం యువకుడి దారుణ హత్య..
ల్గొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లవ్ ఎఫైర్ వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
దిశ, వెబ్ డెస్క్: నల్గొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లవ్ ఎఫైర్ వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిడమానూర్ మండలం గుండిపల్లిలో నవీన్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఈ విషయం యువతి బంధువులకు తెలియడంతో యువతిని మర్చిపోకపోతే చంపేస్తామని నవీన్‌ను బెదిరించారు. ఈ క్రమంలో యువకుడు యువతి బంధువులతో మాట్లాడమని తిరుమల్ అనే వ్యక్తిని కలిసినట్టు సమాచారం. ఆ తర్వాత తిరుమల్ యువతి బంధువులను చర్చకు పిలిచాడు. దీంతో యువతి బంధువులు మూడు బైక్‌లపై 9 మంది వచ్చి నవీన్‌ను కత్తులతో పొడిచి చంపేసి పారిపోయారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.