నాగార్జునసాగర్ చూసొద్దాం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఓపెన్ చేయడంతో చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఓపెన్ చేయడంతో చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. 22 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,29886 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ ద్వారా 8144, ఎడమ కాల్వ ద్వారా 8193, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,501, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులతో కలిపి 3,14,544 క్యూసెక్కులను రిలీజ్చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 2,94,003 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ఇప్పుడు 587.30 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, 305.6838 టీఎంసీల నిల్వ ఉంది.