అంగన్వాడీ కేంద్రాల్లో కొరవడిన నిఘా

రాజపేట మండలంలోని 42 అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న పోషకాహార పదార్థాలు నిఘా లేక పక్కదారి పడుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-12-26 10:55 GMT

దిశ,రాజపేట: రాజపేట మండలంలోని 42 అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న పోషకాహార పదార్థాలు నిఘా లేక పక్కదారి పడుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టగూడెం అంగన్వాడీ కేంద్రం బాలామృతం పక్కదారి పట్టిన విషయం ఎస్ఓటి పోలీసుల ద్వారా జిల్లా కలెక్టర్ నిర్ధారణ చేసుకొని టీచర్ ను సస్పెండ్ చేయగా..మిగతా అంగన్వాడీ కేంద్రాలలో నిర్వాణ ఇలాగే ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్టగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిడిపిఓ స్వరాజ్యం తనిఖీ చేయగా.. నిర్వహణ లోపాలు ఉన్నాయని గుర్తించి నివేదికను కలెక్టర్ కు అందజేశారు. ఇదే తరహాలలో బొందుగుల, రాజపేట 2 సెక్టార్ల లోని 42 అంగన్వాడి కేంద్రాలు త్వరలోనే తనిఖీలు చేసి తప్పులున్నచోట్ల చర్యలు తీసుకోనున్నట్లు సిడిపివో తెలిపారు. రాజపేట మండలానికి ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపం వల్ల వారి సహకారంతో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. చిన్నపిల్లలకు, విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు అందజేసే పోషకాహారం తప్పుడు లెక్కలతో దుర్వినియోగం అవుతున్నట్లు పుట్టగూడెం అంగన్వాడి కేంద్రంలో జరిగిన విషయంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సూపర్వైజర్లపై కూడా కొందరు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల, విద్యార్థులు,గర్భిణీ, బాలింతల సంఖ్య పంపిణీ రిజిస్టర్ల నమోదు విషయాలు నిర్లక్ష్యంగా కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.


Similar News