ఎన్నికల నేపథ్యంలో రూ. 50 వేలుకు మాత్రమే అనుమతి

పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ. 50 వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.

Update: 2024-03-22 14:22 GMT

దిశ, సూర్యాపేట: పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ. 50 వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి - 38 రూం నందు గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఆ మొత్తాన్ని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తారని తెలిపారు. ఒక వేల రూ.10 లక్షలకు పైగా ఎక్కువ నగదు పట్టుబడి విడుదల కోసం సంబంధిత ఆదాయపు పన్ను అధికారులకు తెలియ పరిచి నగదు విడుదల కోసం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. అత్యవసరంగా తీసుకుని వెళ్లే డబ్బులకు అధికారులకు ఆధారాలుగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటీ, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యుమెంట్లు, వ్యాపారం సేవల నగదు అయితే లావాదేవీలు వివరాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్‌లోని జిల్లా గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అందుకోసం జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇంఛార్జి జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు నెంబర్ 8374566222ని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఆర్డీఏ మధు సూదన్ రాజ్, జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఎఓ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస రాజు, తదితరులు పాల్గొన్నారు.


Similar News