Drainage water : మురుగు నీటితో చెరువులు, కుంటలను తలపిస్తున్న రోడ్లు..
మోత్కూరు మున్సిపాలిటీలో మురికి కాలువలు నిర్మించక ముందే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం.
దిశ, మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీలో మురికి కాలువలు నిర్మించక ముందే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. అధికారులు గతంలో పెద్ద పెద్ద మురికి కాలువలు నిర్మిస్తామని పాలకులు చెప్పుకుంటూ వస్తూ డ్రైనేజీలు నిర్మించక ముందే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. అంబేద్కర్ చౌరస్తా నుండి హెచ్పి పెట్రోల్ బంక్ నుండి సుమారు అర కిలోమీటర్ మురికి కాలువ ద్వారా ప్రవహించే నీరు రోడ్డుపైనే ప్రవహించడంతో వచ్చే వాసన మురుగునీరు రహదారి పై చేరడంతో వాహనాల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సక్రమంగా మురికి కాలువల ద్వారా వెళ్లకుండా రోడ్డు పైకిరావడంతోదుర్వాసనవెదజల్లుతున్నాకనీసం అటువైపు చూడని మున్సిపల్ అధికారులు, సిబ్బంది తీరుతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాధనంతో పెద్ద పెద్ద మురికి కాలువలు నిర్మించిన తర్వాత రోడ్డు విస్తరణల పనులు చేయాలని ప్రజలు పదే పదే కోరుతున్నా అధికారులకు చెవికెక్కకపోవడం ఈ దుస్థితికి అద్దం పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం వలన మురికి కాలువలు నిర్మిస్తున్నప్పుడు కొత్తగా వేసే రోడ్డుని తవ్వవలసి వస్తుంది. ఇలా రోజుల తరబడి కాలయాపనతో పాటు ప్రజాధనం కూడా వృధా అవుతుంది. కాబట్టి ప్రజలకు, వ్యాపారవేత్తలకు, వాహనదారులకు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు మురికి కాలువలు నిర్మించిన మీదట రోడ్డు విస్తరణపనులుచేపడితేబాగుండేదని మున్సిపల్ కేంద్రంలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.