కనీవినీ ఎరగని అభివృద్ది చేసి చూపిస్తా గెలిపించండి : ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం

భువనగిరి నియోజక వర్గాన్ని కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తాననీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

Update: 2023-11-10 10:09 GMT

దిశ, భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజక వర్గాన్ని కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తాననీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోటీతో రసవత్తర రాజకీయం రంజుగా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి గడ్డపై చారిత్రాత్మక గెలుపును లక్ష్యంగా చేసుకొని ప్రచార జోరుతో జననీరాజనాలతో కదులుతూ గెలుపే తరువాయి అన్న సంకల్పంతో దూసుకెళుతున్నారు. శుక్రవారం పట్టణంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మొదటగా మాధవనగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో ఆయన ప్రచారం  ప్రారంభించారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ని గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ సైనిక శ్రేణుల మధ్య అన్ని వార్డులలోని కాలనీలకు తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఈసారి తనను తప్పకుండా అసెంబ్లీకి పంపాలని కోరారు. ఓటర్లు కూడా "నువ్వు ఈసారి గెలవాలి బిడ్డా" అని వృద్ధులు సైతం ఆశీర్వదించడం కుంభం గెలుపు పట్ల ప్రజలకున్న బలమైన కోరిక వ్యక్తమైంది. నారాయణ గిరి గ్రామంలో54 మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా వారికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో కూసుకుంట్ల రవీందర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి(బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి టౌన్ )బద్దం రవీందర్, బుగ్గ లింగస్వామి, ఐలయ్య, నర్సింహా, సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెరుకు జంగయ్య గౌడ్, చెరుకు బాలరాజ్ గౌడ్ పోచంపల్లి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు బండి యాదగిరి ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...రైతులను దగా చేస్తున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని మూసి ప్రక్షాళన లేదు, భూగర్భ జలాల కలుషితంతో తీవ్రంగా పంట నష్టం కలుగుతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ప్రాణాలను హరిస్తున్న రసాయన పరిశ్రమలపై చర్యలు లేవనీ, చేనేత రుణ మాఫీ లేదు, ధాన్యం కొనుగోళ్లలో ప్రతి సారి అక్రమాలు జరుగుతున్నాయని అభివృద్ది అంటే రోడ్స్, డ్రైనేజీ ల నిర్మాణమేనా అని తీవ్రంగా విమర్శించారు. అనంతరం ఆయన పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేశం, మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, జిల్లా కిసాన్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ భారత లవ కుమార్, ఆర్‌జీ‌పీఆర్‌ఎస్ జిల్లా కో ఆర్డీనేటర్ జి.రమేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సృజన బిట్ల గణేష్, కుక్కకుమార్ రుద్ర చంద్రశేఖర్ కీర్తి సంజీవ, వంగూరి పాండు, కట్కూరి పాండు, జింకల జయ సూర్య భోగ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News