Komatireddy Venkat Reddy : బిడ్డ.. అనిల్ కబర్ధార్..!

నాపై, నా కార్యకర్తలపై అడ్డగోలు కామెంట్లు చేస్తే సహించేది

Update: 2023-08-16 13:08 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : నాపై, నా కార్యకర్తలపై అడ్డగోలు కామెంట్లు చేస్తే సహించేది లేదని, బిడ్డ అనిల్ కుమార్ రెడ్డి ఖబర్దార్.. అంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో పార్లమెంట్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కడు పోతే 100 మందిని తయారు చేసే శక్తి తనకు ఉందని తెలిపారు. నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాలో బాత్రూం కడిగేదని గుర్తు చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కచ్చితంగా బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ ,రాహుల్ గాంధీకి చెప్పామన్నారు. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే సహించేది లేదన్నారు. కాంట్రాక్టర్లు , రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోతే పార్టీకి జరిగే నష్టమేమీ ఉండదన్నారు. సామాజిక తెలంగాణ వాదన చెప్పే కెసిఆర్ ఆయన మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించడం లేదంన్నారు.

కేసీఆర్ కేబినెట్ లో ఎక్కువ మంది ఓసి లే ఉన్నారని అన్నారు. కేసీఆర్ చెప్పిన రుణమాఫీ వడ్డీకే సరిపోవడం లేదన్నారు. పంట నష్టం పది వేలు ఇస్తామని చెప్పి ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీ ,ఎమ్మెల్యే,మంత్రి ,ముఖ్యమంత్రి పదవి తనకు అవసరం లేదని బతుకు తెలంగాణ కావాలన్నారు. తాను వ్యాపారాలు చేసి గుట్టలు ,కొండలు అమ్ముకునే వ్యక్తి కాదన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గంధ మల్ల రిజర్వాయర్ పనులు అప్పగించి ఇంతవరకు పనులు ప్రారంభం చేయాలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ను కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేశాడని కేసీఆర్ ను విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, సిరిసిల్ల రాజయ్య, డిసిసి అండెం సంజీవరెడ్డి, నల్గొండ డిసిసి శంకర్ నాయక్, బీర్ల ఐలయ్య, పోత్నక్ ప్రమోద్ కుమార్, ఎల్లంల సంజీవ రెడ్డి, బోరెడ్డి అయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News