కుటుంబ పాలన అంతానికే కాంగ్రెస్ లో చేరాను

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు అధికారం చాలా ఇస్తున్న కుటుంబ పాలనను అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2023-11-09 10:06 GMT

దిశ, నకిరేకల్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు అధికారం చాలా ఇస్తున్న కుటుంబ పాలనను అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగితే కేసీఆర్ ను ఓడించొచ్చు అనుకున్న కానీ అక్కడ న్యాయం జరగడం లేదన్నారు. కవితను జైలులో వేయాలని అమిత్ షాను కోరిన పట్టించుకోలేదని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం చేపట్టే నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ ఓట్లతో గెలిచి నమ్మకద్రోహం చేసిన ద్రోహికి బుద్ధి చెప్పాలని కోరారు. కోమటి రెడ్డి సోదరులను విమర్శించడం తగదని చిరుమర్తి లింగయ్యను హెచ్చరించారు.

డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చిరుమర్తి లింగయ్య ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ఏ పోలీసులతో కేసులు పెట్టించాడు అదే పోలీసులతో బయటకు గుంజుతామన్నారు. నకిరేకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. పేదలకు న్యాయం జరగాలన్న కుటుంబ పాలనను సాగనంపాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు. నల్లగొండ నకిరేకల్ మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని తెలిపారు. మునుగోడు నకిరేకల్ నాకు రెండు కళ్లులాంటివి అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, దైద రవీందర్, తదితర నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News