మైనర్ బాలికపై లైంగిక దాడి..?

మద్యం మత్తులో ఓ యువకుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి చండూరు మండలంలో చోటు చేసుకున్నట్లు విశ్వసనియ సమాచారం.

Update: 2024-10-07 05:08 GMT

దిశ, చండూరు: మద్యం మత్తులో ఓ యువకుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి చండూరు మండలంలో చోటు చేసుకున్నట్లు విశ్వసనియ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం మండలంలోని ఓ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సిమెంటు పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కుటుంబంలో తాతతో పాటు ఇద్దరు మైనర్ బాలికల (11 సంవత్సరాల లోపు ) ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు వీరి కుటుంబంతో పరిచయం పెంచుకుని తాతకు రోజు మద్యం తాపిస్తూ నమ్మకం కల్పించాడు. తాజాగా ఆదివారం ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీస్‌లు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.


Similar News