పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

తుర్కపల్లి మండలంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Update: 2024-07-02 11:06 GMT

దిశ,ఎం,తుర్కపల్లి: తుర్కపల్లి మండలంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేలు పల్లి గ్రామంలో 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మండల కేంద్రంలో 17 లక్షలతో పిఎసిఎస్ షాపింగ్ కాంప్లెక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 లక్షలతో విశ్రాంతిని భవనం, జేగ్య తండా గ్రామంలో 5లక్షల సిసి రోడ్డు, వాసాలమర్రి గ్రామంలో మల్టీ పర్పస్ భవనం, ఇంద్రనాగర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ… ఏ రైతు ఇబ్బంది పడకుండా నిజమైన వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు.

కొండలు, గుట్టలు,వెంచర్ లు ఉన్నవారికి రైతు భరోసా రాదన్నారు. గతంలో మాదిరిగా రైతు లు ఇబ్బంది పడకుండా రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను అందేటట్లు చేస్తామన్నారు. రైతును రాజు చేసే ఈ రైతు భరోసా ను దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారన్నారు. కృత్రిమ ఎరువులు కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించాలని రైతులను కోరారు.

ప్రభుత్వంలో ప్రతిగ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్యారెంటీ లతో పాటు గ్రామంలో పలు భవనాల నిర్మాణాలు,రోడ్ల నిర్మాణాలు చేపట్టి మండలాలను గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య సుశీల రవీందర్ నాయక్, ఎంపీటీసీ గద్దె కరుణాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ ,మాజీ సర్పంచ్ సోమల్ల వెంకటేష్, ఎమ్మార్వో దేశ్య నాయక్, ఎంపిడిఓ జన్సీ లక్ష్మీబాయ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News