కుర్రారంలో ఉచిత వైద్య శిబిరం

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 115వ, ఉచిత వైద్య,న్యాయ సలహా శిబిరం రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో ఆదివారం జరిగింది.

Update: 2024-12-15 12:48 GMT

దిశ,రాజపేట: చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 115వ, ఉచిత వైద్య,న్యాయ సలహా శిబిరం రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో ఆదివారం జరిగింది. భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్ నిర్వహించే పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా..ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కుర్రారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జాతీయ వైద్యరత్న అవార్డు గ్రహీత ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ సిహెచ్ రాజ్ కుమార్,జనరల్ ఫిజీషియన్,డయాబెటిస్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ సిహెచ్ అశ్లేష బిడిఎస్ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచి పాండవుల లక్ష్మన్, బి. చంద్రయ్య,బూర్గు రమేష్, కే.అంజిరెడ్డి,బి. శ్రీనివాస్ బి.రవీందర్ రెడ్డి,బి.భాస్కర్,ఐలయ్య, మల్లయ్య తదితరులున్నారు.


Similar News