సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కార్యక్రమం కొనసాగింది.
దిశ యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కార్యక్రమం కొనసాగింది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగ పాండరి మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 500 పైచిలుకు సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు, ఉద్యోగ భద్రత లేదని ఏదైనా ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే కనీస ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.