అయ్యప్ప మహా పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
రాజపేట మండలం చల్లూరు గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజకు మాజీ ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దిశ,రాజపేట: రాజపేట మండలం చల్లూరు గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజకు మాజీ ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధారణ ద్వారా స్వాములు దేహ, మనసు శుద్ధి జరుగుతుందని ప్రజల్లో ప్రత్యేకమైన భక్తిశ్రద్ధలు పెంపొందించబడతాయని తెలియజేశారు. మాల ధారణ చేసిన స్వాములందరు అయ్యప్ప దర్శనానికి క్షేమంగా వెళ్లి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్,సామల రమేష్ స్వామి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి కటకం స్వామి,మండల యువజన నాయకులు పిట్టల వెంకటేష్, తండా వెంకటేష్ మరియు కటకం పృథ్వి తదితరులు పాల్గొన్నారు.