రేపటి నుంచి ధనుర్మాసం

విష్ణు భగవానునికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం

Update: 2024-12-15 14:55 GMT

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): విష్ణు భగవానునికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఈ ధనుర్మాస వేడుకలకు వైష్ణవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. నేటి నుంచి(డిసెంబర్ 16) వచ్చే ఏడాది జనవరి 13 భోగి పండుగ వరకు జాజిరెడ్డిగూడెం లోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాల వంశపారంపర్య అర్చకులు అర్వపల్లి రాంబాబు, పవన్ కుమార్ తెలిపారు. ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న కూడారై ఉత్సవం, 13న భోగి పండుగ రోజు గోదారంగనాథుల కళ్యాణం జరుగుతాయని తెలిపారు. ఈ ధనుర్మాస ఉత్సవాలు పూర్తిగా తెల్లవారుజామున జరుగుతాయని, ఇందులో రోజుకో పాశురం చొప్పున 30 పాశురాలను పఠిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Similar News