ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలోని ఎన్నారం గ్రామంలో 40 లక్షలతో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ పునః నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.
దిశ,రామన్నపేట : మండలంలోని ఎన్నారం గ్రామంలో 40 లక్షలతో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ పునః నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఆలయ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నూతన హంగులతో నిర్మాణం చేపట్టనున్న ఆలయానికి వేదపండితులు..మంత్రోచ్ఛారణలతో భూమి పూజను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ ఛైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ ఎంపిపి కక్కిరేణి ఎల్లమ్మవిజయ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, గుత్తా నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీకాంతరావు, గుడి పునర్నిర్మాత నల్ల భాస్కర్ రెడ్డి, పున్న జగన్మోహన్, ప్రభాకర్, రామిని రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఎనుగు దామోదర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సుధాకర్, కొండూరు శంకర్, జగదీశ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.