కోదాడలో మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్: శశిధర్ రెడ్డి
కోదాడ పట్టణంలో మెగా జాబ్ మేళా పోస్టర్‌ను శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి. చందర్ రావు నివాసంలో కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ కన్మంతరెడ్డి. శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు..
దిశ , కోదాడ టౌన్: కోదాడ పట్టణంలో మెగా జాబ్ మేళా పోస్టర్‌ను శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి. చందర్ రావు నివాసంలో కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ కన్మంతరెడ్డి. శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో ఎంతోమంది విద్యార్ధులు, యువతీ యువకులు సరైన ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని.. గతంలో కాలేజీలు నడిపిన అనుభవంతో వారిని దృష్టిలో ఉంచుకొని తాను ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోదాడ పట్టణంలో ఈ నెల 25 వ తారీకున పెరిక భవన్ నందు 72 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు కన్మంతరెడ్డి. శశిధర్ రెడ్డి తెలిపారు.
ఏడవ తరగతి నుండి పీజి చేసిన విద్యార్ధుల వరకు అందరికి అవకాశం ఉంటుందని అందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి విడత మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని మొత్తం మూడు విడతలలో పది వేల మందికి అవకాశం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి. చందర్ రావు , మాజీ డీసిసిబి అధ్యక్షుడు ముత్తవరపు. పాండురంగారావు , చిలుకూరు జడ్పిటీసీ బొలిశెట్టి. నాగేంద్రబాబు నాయకులు గుంపుల. శ్రీను , తిపిరిశెట్టి. రాజు తదితరులు పాల్గొన్నారు.