వరద నష్టపరిహారం అందించాలి
వరద నష్టపరిహారం అందించాలని అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన 30 మంది లబ్ధిదారులు బీజేపీ కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, జనార్ధన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు.
దిశ, కోదాడ : వరద నష్టపరిహారం అందించాలని అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన 30 మంది లబ్ధిదారులు బీజేపీ కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, జనార్ధన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు మొక్కుబడిగా సర్వే చేశారని తెలిపారు. వరద ఉధృతితో ఇళ్లలోకి నీరు చేరిందని, దీంతో విలువైన వస్తువులు కొట్టుకొని పోయాయని తెలిపారు.
అధికారులు సర్వే మొక్కుబడిగా చేశారని అన్నారు. గ్రామం మొత్తం వరద వస్తే కొంతమందికే నష్టపరిహారం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. వారికి నచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుని వారికే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇన్చార్జ్ ఆర్డీఓ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. వారి వెంట నెల్లూరు జనార్ధన్ రావు, నాగరాజు, బయ్యపు కొండలు, జిల్లా సత్యనారాయణ, సైదయ్య, లింగస్వామి, కనకలక్ష్మి, బిందు పాల్గొన్నారు.