కూకట్ పల్లిలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు..

Update: 2023-10-05 11:58 GMT

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి నియోజకవర్గంలో గురువారం మంత్రి కేటీర్​ముఖ్య అతిథిగ హాజరవుతున్న బీఆర్‌ఎస్​ప్రగతి నివేదన సభ ప్రాంగణ సమీపంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా షేమ్.. షేమ్​ కేటీఆర్​అంటూ పలు ఫ్లైఓవర్​బ్రిడ్జి పిల్లర్‌లకు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలు కలకలం సృష్టించాయి.


అభివృద్ధి పేరుతో చెరువులు, ప్రభుత్వ భూములు మాయం, రాబంధు కేటీర్..​షేర్​లేకుండా ఏ ప్రాజెక్టు సాగదు అది ప్రభుత్వానిదైనా అయిన ప్రైవేట్ ఐనా.. 'ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న హామీ ఇంకా ఎన్ని సంవత్సరాలకు నెరవేరుతుంది' కేటీఆర్​గారు అని రాసి ఉన్న ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సిలు గుర్తించిన పోలీసులు ఎటువంటి గొడవలు జరగకుండా వెంటనే ఫ్లెక్సిలను తొలగించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి గురించి గాలిస్తున్నట్టు సమాచారం.


Similar News