పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..భర్త ఆత్మహత్య
మండలంలోని వెల్లంకి గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
దిశ,రామన్నపేట : మండలంలోని వెల్లంకి గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వనం బాలరాజు (38) భార్యను కొట్టడంతో ముగ్గురు కూతుర్లను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో వారం పది రోజుల నుండి బాలరాజు తాగుడుకు బానిసై ఇంట్లో చీరతో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఎలా ఉన్నాడోనని తన పెద్ద కూతురు వనం మధుబాల ఇంటికి వెళ్లి చూసేసరికి తండ్రి ఇంట్లో దూలానికి వేలాడుతుండడంతో..ఏడ్చుకుంటూ తన తల్లి అయిన రాజేశ్వరికి సమాచారం అందించింది. రాజేశ్వరి వెంటనే వచ్చి చూడగా అప్పటికే బాలరాజు మృతి చెందాడు. తన భర్త మరణానికి ఎవరికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.మల్లయ్య బుధవారం తెలిపారు.