సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయo ముందు 9 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.

Update: 2024-12-18 15:07 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయo ముందు 9 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. బుధవారం మోకాళ్లపై వినూత్న ప్రదర్శన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం 13-09-2023 న హన్మకొండలోని ఏకశీల పార్క్ దీక్ష శిబిరంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే పే స్కెల్ అమలు చేసి..రీ ఎంగేజ్ విధానం తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ నియామకలలో వెయిటేజ్ కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ఎక్సగ్రెషియా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైయినా ప్రభుత్వం స్పందించి సంఘ నాయకులను పిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని, తక్షణమే పే స్కెల్ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేయాలన్నారు. లేనిచో తమ సమస్యలు తీర్చే వరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందన్నారు. త్వరగా ప్రభుత్వం స్పందించి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు చెరుకు కిరణ్ కుమార్ నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాస్, వెంకటరమణ,గుగులోతు చినా నాయక్,ఐలయ్య,జానయ్య,సయ్యద్, లక్ష్మి నారాయణ, రాంబాబు, పెండెం శ్రీనివాస్, శ్రీధర్,తేజ శ్రీ, హారిత తదితరులు పాల్గొన్నారు.


Similar News