మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జగన్ నాయక్ తండా సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-12-18 15:44 GMT

దిశ ,చివ్వెంల : మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జగన్ నాయక్ తండా సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మొండి కత్తి ప్రశాంత్ ( 29 )చిన్నతనంలో తల్లి చనిపోగా..అతని బంధువులు దురాజ్పల్లి గ్రామానికి చెందిన మొండి కత్తి జానమ్మ వద్ద ఉంటున్నారు. మృతుడు సుమారు ఐదు సంవత్సరాల నుండి మతిస్థిమితం లేక రోడ్డు వెంబడి తిరుగుతూ అనారోగ్యం పాలైయ్యాడు.  బుధవారం ఉదయం ఇంటి నుండి స్వామి నారాయణ స్కూల్ వైపు వెళ్లి..అక్కడ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద హైవే రోడ్డు పక్కన చనిపోయి ఉన్నాడు. దీంతో గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్వర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.


Similar News