అంతిమ విజయం కమ్యూనిజానికి: సీపీఐ
ఎన్ని అడ్డంకులు వచ్చినా కమ్యూనిజానిదే అంతిమ విజయమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు.
దిశ, చిలుకూరు: ఎన్ని అడ్డంకులు వచ్చినా కమ్యూనిజానిదే అంతిమ విజయమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. చిలుకూరు సీపీఐ భవన్ లో గురువారం బీఆర్ఎస్ నాయకులు పలువురు సీపీఐలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిండికి గతి లేని దీన స్థితిలో ఉన్న శ్రీలంకకు కమ్యూనిజమే ఆశాకిరణం అయిందని, దానికి మన దేశమూ భిన్నమైనదేమీ కాదని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, చిలుకూరు ప్యాక్స్ డైరెక్టర్ కస్తూరి సైదులు, ఉడుం నర్సింహారావు, దుగ్గెబోయిన అంజయ్య తదితరులను సీపీఐ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శులు షేక్ సాహెబ్ అలీ, చిలువేరు ఆంజనేయులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి దొడ్డా నారాయణరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండవ ఉపేందర్, కొండా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా కమ్యూనిజానిదే అంతిమ విజయమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు.