ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్: ఎస్పీ అపూర్వ రావు
ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను మరింత విస్తృతం చేయనున్నట్లు ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు.
దిశ, నల్లగొండ: ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను మరింత విస్తృతం చేయనున్నట్లు ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలలో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 1,188 మంది పట్టుబడగా వారిలో 453 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపారు.
అందులో 21 మందికి ఒక రోజు, ఎనమిది మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష మరియు జరిమానా విధుస్తూ కోర్టు తీర్పును వెలువరించినట్లు ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో మొత్తం 1,188 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా రూ.1,78,830లు జరిమాన రూపంలో విధించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లిదండ్రులే అందుకు పూర్తి బాధ్యత వహంచాలని హెచ్చరించారు. వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.