పండగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో సంక్రాంతి పండగ పూట ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2025-01-15 07:26 GMT
పండగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
  • whatsapp icon

దిశ, వేములపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో సంక్రాంతి పండగ పూట ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర సంఘటన వేములపల్లి మండలం భీమారం - సూర్యాపేట రోడ్డు పై ఇటుక బట్టీల సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన పోరెడ్డి వెంకటరమణారెడ్డి (48) అత్త అనారోగ్యంతో బాధపడుతుండగా నల్గొండలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

తిరిగి ద్విచక్ర వాహనం పై మిర్యాలగూడ నుండి మొల్కపట్నం వైపు వస్తుండగా సూర్యాపేట నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 సాయంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.


Similar News