అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
అనారోగ్యంతో బాధపడుతూ ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వర్కట్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ,వలిగొండ: అనారోగ్యంతో బాధపడుతూ ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వర్కట్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వర్కట్ పల్లి గ్రామానికి చెందిన మీసాల బిక్షపతి రెండవ కుమారుడు గత కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ మీసాల తరుణ్ కుమార్ (22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన స్థానిక రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.