చైనా మాంజాతో దంపతులకు గాయాలు...

చైనా మాంజా దారం తగిలి ద్విచక్ర వాహనం పై వెళ్తున్న దంపతులకు గాయాలైన సంఘటన యాదగిరిగుట్టలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2025-01-15 09:33 GMT
చైనా మాంజాతో దంపతులకు గాయాలు...
  • whatsapp icon

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : చైనా మాంజా దారం తగిలి ద్విచక్ర వాహనం పై వెళ్తున్న దంపతులకు గాయాలైన సంఘటన యాదగిరిగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. గోధుమ కుంటకు చెందిన దంపతులు తమ ద్విచక్ర వాహనం పై యాదగిరిగుట్టకు వస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీస్ వద్దకు రాగానే చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతుకు గాయమైంది. అతడి భార్య వాహనం పై నుంచి పడడంతో గాయాలపాలైంది. వెంటనే 108 వాహనం ద్వారా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


Similar News