పులి వెంకటేశ్వర్లుకు ఎస్ఐగా ప్రమోషన్
కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు ఎస్ఐ గా పదోన్నతి పొందారు.
దిశ,కోదాడ : కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు ఎస్ఐ గా ప్రమోషన్ లభించింది. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎస్ఐగా ఉత్తర్వులు అందజేశారు. కోదాడ మండలం గుడిబండకు చెందిన పులి వెంకటేశ్వర్లు పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం పొంది అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అంచలంచలుగా పదోన్నతులు పొంది ఎస్సైగా ఎదిగారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. పదోన్నతి రావడం ఎంతో ఆనందంగా ఉన్నదని ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా వెంకటేశ్వర్లు ఎస్సైగా పదోన్నతి పొందడం పట్ల పలువురు మిత్రులు ,బంధువులు ,పోలీసు శాఖ ఉద్యోగులు ఆయన్ను అభినందిస్తున్నారు.