Huge Traffic Jam : విజయవాడ - హైదరాబాద్ రహదారిలో భారీ ట్రాఫిక్ జామ్

విజయవాడ - హైదరాబాద్(Vijayawada-Hyderabad) రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్(Huge Traffic Jam) ఏర్పడింది.

Update: 2025-01-15 14:29 GMT
Huge Traffic Jam : విజయవాడ - హైదరాబాద్ రహదారిలో భారీ ట్రాఫిక్ జామ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ - హైదరాబాద్(Vijayawada-Hyderabad) రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్(Huge Traffic Jam) ఏర్పడింది. సంక్రాంతి పండుగకు దాదాపు ముప్పావు వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండగ జరుపుకొని తిరిగి నగరబాట పట్టారు. సెలవులు ముగిసి ఆఫీసులు, స్కూళ్ళు తెరవనుండటంతో అంతా మళ్ళీ నగరానికి చేరుకుంటున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా(Panthangi Toll Plaza) దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వాహనాల రద్దీ తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.   

Tags:    

Similar News