యాదాద్రి ఆలయంపై డ్రోన్ కలకలం..
యాదాద్రి ఆలయం పైన మరొక సారి డ్రోన్ కలకలం సృష్టించింది.
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయం పైన మరొక సారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఇందుకు కారణమైన ఇద్దరు యువకులను ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఇద్దరు యువకులు హైదరాబాద్‌కు చెందిన యువకులుగా సమాచారం అందింది. ప్రస్తుతం ఎస్పీఎఫ్ సిబ్బంది యువకుల నుంచి డ్రోన్, కార్,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది. భద్రతా దృష్ట్యా లోపాల వల్ల విచ్చల విడిగా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని డ్రోన్‌లతో చిత్రీకరిస్తున్నారని స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో మూడవసారి డ్రోన్‌ల ప్రదర్శనలు జరగడంతో భద్రత విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగించిన ఇద్దరు యువకులకు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువకులు డ్రోన్ ఎందుకు ప్రయోగించారో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక డ్రోన్ వినియోగానికి సంబంధించి కేంద్రం సవివరమైన నిబంధనలు రూపొందించింది. యూజర్లు తమ పేరు, డ్రోన్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్‌ఫాంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటికి ప్రత్యేక యూఐఎన్ సంఖ్య, యూఏఓపీ లైసెన్స్‌ను కేటాయిస్తారు.