పేరుకే డబుల్ రోడ్డు.. ఏం జరిగిందో చూడండి..
పేరుకే డబుల్ రోడ్లు కానీ విపరీతమైన చెట్లు ఉండటంతో.. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశ చింతలపాలెం: పేరుకే డబుల్ రోడ్లు కానీ విపరీతమైన చెట్లు ఉండటంతో.. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే... గుడిమల్కాపురం, దొండపాడు డబుల్ రోడ్డు ఏర్పడి 10 సంవత్సరాలు అయ్యింది. కానీ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు మొలవటంతో.. మరమ్మత్తుల విషయంలో ఆర్ అండ్ బి అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అటుగా పొలాలకు వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందల వాహనాలు తిరిగే ఈ రోడ్డులో ఎక్కువగా మూల మలుపులు ఉండటంతో.. రోడ్డు మొత్తాన్ని చెట్లు చుట్టేస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ..ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను తొలగించి ,వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.