డివైడర్‌ను ఢీకొట్టిన లారీ.. భారీగా మంటలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- విజయాడ జాతీయ రహాదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

Update: 2024-10-11 09:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- విజయాడ జాతీయ రహాదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన లారీ డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మంటలు భారీగా చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. కాగా, మంటలు భారీగా చెలరేగడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.


Similar News