‘గ్రామాల్లో బెల్టు షాపులను నియంత్రించాలి’

గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం లభించడం వల్ల చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు మద్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-10-06 07:39 GMT

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): గ్రామాల్లో విచ్చలవిడిగా, 24 గంటలు నడుస్తున్న మద్యం బెల్టు షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు నియంత్రించాలని ఫూలే అంబేద్కర్ ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈదురు వీర పాపయ్య డిమాండ్ చేశారు. గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం లభించడం వల్ల చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు మద్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు బెల్టుషాపులను నియంత్రించాలని కోరారు.


Similar News