పీఏసీఎస్ సీఈవోను సస్పెండ్ చేసిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఏసీఎస్ సీఈవోను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు.

Update: 2024-11-11 12:53 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఏసీఎస్ సీఈవోను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు. సోమవారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని పీఏసీఏస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలోmసీఈవో విధులకు అనధికారికంగా గైర్హాజరు అయ్యారు. సెంటర్ లో టార్పాలిన్ కవర్స్ సెంటర్ లో అందుబాటులో ఉంచకపోవడం, జాలీ మిషన్ కూడా రైతులకు అందుబాటులో లేకపోవడం పట్ల అగ్రహాం వ్యక్తం చేశారు. లారీ ఏజెన్సీతో సమన్వయం చేయలేదని, పీఏసీఎస్ పరిధిలో ఒక్క ట్యాబ్ ఎంట్రీ కూడా చేయలేదని అగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో సీఈవో జలెందర్ ని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకంటామని హెచ్చరించారు


Similar News