బెల్ట్ షాపులను నియంత్రణ చేయాలి

మండల పరిధిలోని బోరింగ్ తండా గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను నివారించాలంటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ కి తండా వాసులు సోమవారం వినతిపత్రం అందజేశారు

Update: 2024-11-11 12:37 GMT

దిశ,ఆత్మకూరు ఎస్ : మండల పరిధిలోని బోరింగ్ తండా గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను నివారించాలంటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ కి తండా వాసులు సోమవారం వినతిపత్రం అందజేశారు. మండలంలోని గట్టికల్లు పాతర్లపాడు ఇస్తాళపురం గ్రామాలు గత కొద్దిరోజులుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడంతో..ఈ 3 గ్రామాల మధ్య లో ఉన్న బోరింగ్ తండా లో మద్యందందా పెరిగిందని వారు తెలిపారు. మద్యం బెల్ట్ షాపుల వద్ద రాత్రి పగలు విచ్చల విడిగ మద్యం తాగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, మద్యం మత్తులో గ్రామంలో సమస్యలు తాలెత్తుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో అఖిలపక్షల ఆధ్వర్యంలో.. గత వారం రోజుల క్రితం మద్యం నిషేధం పాటించాలంటూ తీర్మానం చేసుకొని పంచాయతీ కార్యదర్శులు ద్వారా నోటీసులు పంపించినప్పటికి మద్య బెల్ట్ షాపుల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు రెండు వైపులా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ..ప్రజాజీవనానికి పాఠశాల విద్యా బోధనకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని, వెంటనే మద్యం బెల్ట్ షాపులను నివారించకపోతే గ్రామస్తులు రోడ్డుపై రాస్తారోకో చేస్తామని, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టనున్నట్లు బెల్ట్ షాపులను నియంత్రణ చేయాలితెలిపారు.


Similar News