బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ సంఖ్యను పెంచాలి : జాజుల లింగం గౌడ్

బీసీ ఓవర్సీస్‌ సాలర్‌షిప్‌ మంజూరై విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2024-03-22 09:43 GMT

దిశ, మిర్యాలగూడ టౌన్ : బీసీ ఓవర్సీస్‌ సాలర్‌షిప్‌ మంజూరై విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ…. పెండింగులో ఉన్న నిధుల విడుదల జాప్యం వల్ల స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు, విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీసీల జనాభాకు తగ్గట్టు విదేశీ విద్య సాలర్‌షిప్‌ సంఖ్యను 300 నుంచి కనీసం 2,000 మందికి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడికొండ విక్రమ్, ఇంద్ర పాల్గొన్నారు.


Similar News