ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి.. కేసు నమోదు

అక్రమంగా ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులపై దాడి చేయగా ఒకరికి గాయాలు కావడంతో వాడపల్లి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

Update: 2024-09-07 11:43 GMT

దిశ, మిర్యాలగూడ (దామరచర్ల): అక్రమంగా ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులపై దాడి చేయగా ఒకరికి గాయాలు కావడంతో వాడపల్లి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కె జే ఆర్ కాలనీ బీట్ పరిధిలో గల దిలావర్పూర్ ఆర్ఎఫ్ బ్లాక్ లో కొందరు వ్యక్తులు అటవీ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఇది గమనించిన ఫారెస్ట్ అధికారులు శుక్రవారం రేంజ్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ మల్లారెడ్డి, బీట్ ఆఫీసర్లు ముఖేష్, స్వామి, రవీందర్ రెడ్డిలు ఆక్రమించిన భూమిలో మొక్కలు నాటుతుండగా బాలాజీ నగర్ తండా కు చెందిన వాంకుడోత్ రమేష్ అధికారులపై దాడి చేశాడు. దీంతో బీట్ ఆఫీసర్ ముఖేష్ కాలికి గాయాలు కావడంతో ప్రధమ చికిత్స నిమిత్తం దామరచర్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News