Munugode MLA : పర్మిట్ రూమ్‌లలో ఉదయం మద్యం సేవించే వారికి అనుమతి ఇవ్వొద్దు

మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ షాప్ లో వద్ద

Update: 2024-09-16 10:24 GMT

దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ షాప్ లో వద్ద ఉన్న పర్మిట్ రూములలో ఉదయం మద్యం సేవించే వారికి అనుమతులు ఇవ్వవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్స్ షాప్ యాజమానులకు సూచించారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని వైన్ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైన్స్ షాపులు నకిలీ మందు అమ్ముతున్నారా అని అడుగుతూ మద్యం బాటిల్లను పరిశీలించారు. వైన్స్ షాప్ లో పక్కనే ఉన్న పర్మిట్ రూములను ఆయన పరిశీలిస్తుండగా అక్కడ మద్యం సేవిస్తున్న మద్యం ప్రియులను ఆయన ప్రశ్నించారు ఇంత పొద్దున్నే మద్యం సేవిస్తే కుటుంబాన్ని ఎలా సాదుతారన్నారు. పొద్దున్న దాంక పనిచేసే వాళ్లు అలసినప్పుడు ఓ సాయంత్రం మద్యం సేవిస్తే తప్పేం లేదని పనులన్నీ మానేసి ఎప్పుడూ మద్యానికి బానిసై మద్యం సేవిస్తే కుటుంబం పరిస్థితి ఏమిటని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో అధిక తాగుడును నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే బెల్ట్ షాపులను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తున్నామన్నారు. గ్రామాలలోని బెల్ట్ షాపులకు మద్యం బాటిల్ అమ్మితే వైన్ షాప్ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News