నా బిడ్డ చావుకు డాక్టర్లు,నర్సులే కారణం..కాలుతో కడుపు తొక్కి..

సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం గుర్రంపోడు తండాకు

Update: 2024-09-18 15:08 GMT

దిశ,హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం గుర్రంపోడు తండా కు చెందిన బాసిపాకుల రేణుక తల్లి గారి ఇంటికి డెలివరీకి వచ్చింది. ఈనెల 15 ఆదివారం డెలివరీ కోసం హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తన భార్యను హాస్పిటల్ కి డెలివరీ తీసుకు వస్తే అక్కడ డాక్టర్ అందుబాటులో లేరని నర్సులు పట్టించుకోలేదని నొప్పులు వచ్చే సమయంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. అసలు హాస్పిటల్ లో డాక్టర్ లేకుండా నర్సులే కాన్పులు చేస్తున్నారని ఈ కాన్పులు చేసే సమయంలో నర్సులు తన భార్యను కాలుతో తొక్కడం వల్ల కడుపులోని శిశువు మరణించాడని దీనికి సంబంధించిన నర్సులు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేణుక భర్త జిల్లా నాగరాజు డీఎంహెచ్వో కు ఫిర్యాదు చేశారు . ఈ ఫిర్యాదుపై డీఎంహెచ్ ఓ కోట చలం మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను సందర్శించి విచారణ చేపట్టారు.

సిబ్బంది నర్సులు డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం..

సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం గుర్రంపోడు తండా కు చెందిన యువతి డెలివరీ కావడం అప్పుడే పుట్టిన బేబీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ ద్వారా బేబీని జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగిందనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రికార్డ్ అయినట్లు తెలిపారు. సిబ్బంది, స్టాఫ్ నర్సల, డాక్టర్లు వైద్యం అందినట్టు తెలుస్తుందని అయినప్పటికీ విచారణ మాత్రం పూర్తిస్థాయిలో చేస్తామని అన్నారు. దీనికి సంబంధించి బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.వైద్య సిబ్బంది అందరి పట్ల స్నేహభావం తోనే ఉండాలని, ఎవరు పట్ల కూడా దురుసుగా వ్యవహరించొద్దని హాస్పిటల్ లోని సిబ్బందికి తెలిపినట్లుగా తెలిపారు.పుట్టిన శిశు రెండు రోజులు జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందాడని అక్కడ కూడా విచారణ చేస్తామని అవసరం అనుకుంటే బేబీ పోస్ట్ మార్టం కూడా చేసి వివరాలు సేకరిస్తామని అన్నారు.ఏది ఏమైనా ఇది చాలా ఇబ్బందికర విషయమని పేర్కొన్నారు.తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుందని ఏమైనా ఇబ్బందికరం అనుకుంటే జిల్లా ఆసుపత్రి కి తరలిస్తామన్నారు.తల్లి ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడవద్దని తెలిపారు.


Similar News