విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి..
విద్యుత్ షాక్ కు గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన దెందుకూరు గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, మధిర : విద్యుత్ షాక్ కు గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన దెందుకూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దెందుకూరు గ్రామ సమీపంలోని చెన్నం వారి చెరువుకు ఆనుకొని ఉన్న పత్తి పొలానికి అడవి పందులు వేట కోసం విద్యుత్ వైర్ అమర్చారు. గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో అక్రమంగా వలతో చేపలు పట్టేందుకు చెరువు దగ్గర ఉన్నారనే సమాచారంతో చేపల చెరువులో వాటా దారుడైన చర్చి ఫాదర్ మీసాల శ్రీనివాసరావు చెరువు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్నాడు.
ఇదే సమయంలో అడవి పందుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైరు తగిలి అక్కడకక్కడే మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ డీ.మధు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.