Vishakha Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో సంచలనం.. రెగ్యులర్ తనిఖీల్లో పోలీసులకు మైండ్ బ్లాంక్

విశాఖ సెంట్రల్ జైలు (Vishakha Central Jail)లో మొబైల్ ఫోన్లు (Mobile Phones) దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Update: 2025-01-01 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ సెంట్రల్ జైలు (Vishakha Central Jail)లో మొబైల్ ఫోన్లు (Mobile Phones) దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ (Penna Barrack) సమీపంలో పోలీసులకు భూమిలో నాలుగు అడుగల లోతున పాతిపెట్టిన ఓ అనుమానాస్పద ప్యాకెట్ లభ్యమైంది. అయితే, ఆ కవర్‌ను తెరిచి చూడగా అందులో రెండు సెల్‌ఫోన్లు, ఒక పవర్‌ బ్యాంక్, రెండు చార్జింగ్‌ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

దొరికిన సెల్‌ఫోన్లలో సిమ్ కార్డులు (Sim Cards) కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవర్ దొరికిన పెన్నా బ్యారక్‌ (Penna Barrack)లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్ (Hemanth Kumar), ఇతర ఖైదీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ (MVV) కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో హేమంత్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఓ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. విశాఖ జైల్లో జరిగిన తాజా పరిణామాలపై ఆ రెండు కేసులకు సంబంధించి ఆరిలోవ పోలీసులకు సమాచారం అందజేశామని విశాఖ సెంట్రల్ జైలు ఇంచార్జ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

Tags:    

Similar News